Breaking News

హీరోయిన్ సోషల్ మీడియా ఖాతాలో బూతు బొమ్మలు.. పోలీసులు ఎంటరయ్యాక ఆమె! ఇష్యూ హాట్ టాపిక్


సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల వెకిలి చేష్టలు కూడా అంతకంతకూ పెరుగుతుండటం చూస్తున్నాం. తమ ఇష్టారాజ్యంగా హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు. హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్‌గా పెట్టుకొని రెచ్చిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నటీమణుల విషయంలో ఇలాంటి సంఘటనలు చూశాం. తాజాగా కేరళ టీవీ నటి, హీరోయిన్ సాధికా వేణుగోపాల్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నటి పేరుతో ఓ ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి అందులో పోర్న్ ఫొటోస్ అప్‌లోడ్ చేశారు. ఇండస్ట్రీలో ఒకరు ఇది గమనించి సాధికా వేణుగోపాల్‌‌కి చెప్పడంతో షాకైన ఆమె సదరు అకౌంట్ పరిశీలించింది. తన పేరుతో పాటు తన ప్రొఫైల్ పిక్‌తో ఉన్న ఆ సోషల్ మీడియా పేజీలో బూతు బొమ్మలే కనిపించడంతో వెంటనే ఆమె కేరళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేసును చేధించి సైబర్ నేరగాన్ని పట్టుకున్నారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఏ ఇంటర్నెట్ IP అడ్రెస్ ద్వారా రన్ చేస్తున్నారో పసిగట్టి నేరగాడి ఆచూకీ పట్టేశారు సైబర్ క్రైం పోలీసులు. తీరా అతన్ని పట్టుకొని సాధికా ముందుకు తీసుకువస్తే ఆమె మాత్రం క్షమించి వదిలేసింది. కాకపోతే అతనికి సరైన బుద్ది మాత్రం చెప్పింది. 'తప్పైపోయింది మేడం ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. నా ఫోన్ నా ఫ్రెండ్స్ తీసుకున్నారు. వాళ్లే అలా పెట్టినట్లున్నారు' అని అతను చెప్పడంతో 'ఇదే మీ అమ్మో, అక్కో అయితే వాళ్ల ఫొటోలు పెడతావా? ఇంత అజాగ్రత్తగా ఉంటావా?' అని ప్రశ్నించి చురకలంటించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి క్షమించమని ప్రాధేయపడటంతో అతనిపై పెట్టిన కేసు వాపస్ తీసుకుంది. అతన్ని జైలు పాలు చేసి అతని కెరీర్ నాశనం చేయడం తనకు ఇష్టం లేదని పోలీసులకు చెప్పింది. అతన్ని చాలా త్వరగా పట్టుకున్నందుకు పోలీసులకు థాంక్స్ చెప్పింది సాధిక. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


By August 08, 2021 at 11:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sadhika-venugopal-reaction-on-her-morphed-pictures-at-social-media/articleshow/85146417.cms

No comments