Breaking News

MAA ELections : మగాడంటే రాజ శేఖర్.. నరేష్‌ను ఏకిపారేసిన హేమ


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిన ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ అగ్గి రాజేస్తోంది. ఎంట్రీతో అసలు కథ మొదలైంది. ఇన్ని రోజులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్యే అసలు పోటీ ఉంటుందని అంతా భావించారు. బరిలో జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావులున్నారని పేర్లు మాత్రమే వినిపించేవి. ఎప్పుడూ కూడా వీరు మీడియా ముందుక వచ్చి మా ఎన్నికల మీద స్పందించలేదు. ఎంత సేపు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ నడుస్తున్నట్టుగా వార్తలు వచ్చేవి. కానీ హేమ ఇప్పుడు చక్రం తిప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలు, ఆయన పని చేసిన తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇంత వరకు రూపాయి కూడా సంపాదించలేదని, గతంలో తామెంతో కష్టపడి కూడగట్టిన ఐదు కోట్లను స్వాహా చేసేస్తున్నాడని అన్నారు. ఐదు కోట్లలో ఇప్పటికే మూడు కోట్లు ఖర్చు చేశారని హేమ ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు కానీ ఖర్చు చేసేస్తున్నారని హేమ అన్నారు. ఎన్నికలు జరగ కుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇలా సభ్యులందరికీ వాయిస్ మెసెజ్ చేస్తున్నాను. మీరంతా సంతకం పెడితే.. తాను ఎన్నికలు నిర్వహించాలని పెద్దలకు లేఖ రాస్తాను అని హేమ చెప్పుకొచ్చారు. ఆ ఆడియో టేప్ లీక్ అవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఓ మీడియాతో హేమ మాట్లాడుతూ నరేష్‌ను ఏకిపారేశారు. ఒక్క రూపాయి కూడా అసోసియేషన్ తరుపున సంపాదించలేకపోయారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. సేవ చేస్తే ఎవ్వరూ అడ్డుకోరని, ఇంకా ప్రోత్సహిస్తామని హేమ అన్నారు. కానీ ఉన్న డబ్బులనే ఖర్చు పెట్టడం కాకుండా.. డబ్బులు కూడా కూడబెట్టాలని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా హయాంలో తామెంతో కష్టపడి కూడ బెట్టిన ఐదు కోట్లను నరేష్ ఖర్చు పెడుతున్నారని హేమ అన్నారు. చిరంజీవి కళ్యాణ లక్ష్మీ పథకంలోనూ నరేష్ పక్షపాతాన్ని చూపిస్తారు. పెళ్లి చేసుకునే ప్రతీ జంటకు తాను రెండు లక్షలు ఇస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. అందుకే అది చిరంజీవి కళ్యాణ లక్ష్మీ పథకం అయిందని, కానీ ఏనాడూ కూడా దాన్ని నరేష్ స్టేజ్ పలకలేదని హేమ అన్నారు. అసోసియేషన్‌కు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కానీ మాత్రం పది లక్షలు ఇచ్చారు. మగాడంటే రాజ శేఖర్. ఆయన దగ్గర డబ్బులున్నాయో లేవో గానీ పది లక్షలు ఇచ్చారు. కానీ నరేష్ మాత్రం ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హేమ సంచలన కామెంట్స్ చేశారు.


By August 08, 2021 at 11:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-hema-praises-rajasekhar-and-humiliates-naresh-on-maa-elections/articleshow/85145978.cms

No comments