Breaking News

విశ్వక్ సేన్ పాగల్ టైటిల్ సాంగ్ రిలీజ్.. విడుదల తేదీ ఫిక్స్! యు హీరో డేటింగ్ స్టెప్


టాలెంటెడ్ యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ లుక్స్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నాయి. చంద్రబోస్ అందించిన లిరిక్స్‌పై రామ్ మిరియాల ఆలపించిన తీరు, సాంగ్ తెరకెక్కిన విధానం యమ ఆకర్షిస్తోంది. దీంతో విడుదలైన కొద్ది సేపట్లోనే ఈ సాంగ్ వైరల్ అయింది. ఇప్పటికే విడుదలైన పాగల్ టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేయగా.. తాజాగా విడుదల చేసిన సాంగ్ హైప్ క్రియేట్ చేసింది. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో అలరిస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమా మరో మెట్టు ఎక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు14న థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నరేశ్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్‌సేన్‌ జంటగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా.. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.


By August 08, 2021 at 01:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishwak-sens-paagal-release-date-fix-title-song-released/articleshow/85147442.cms

No comments