Poorna : నేనేమీ అంత పెద్ద హీరోయిన్‌ని కాదు.. నయనతార వల్లే.. పూర్ణ కామెంట్స్
హీరోయిన్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఢీ షోలో ఆమె చేసే ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య అయితే కంటెస్టెంట్లు, మాస్టర్ల బుగ్గలు కొరుకుతూ, ఐ లవ్యూలు చెబుతూ, ముద్దులు పెడుతూ బిజీగా ఉంటున్నారు. పూర్ణచేసే ఈ ఓవర్ యాక్టింగ్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. అక్కడి నుంచి ఆమెను తీసేయండని కోరుతున్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. పూర్ణ ఇప్పుడు అనే సినిమాతో తెరపై కనిపించబోతోన్నారు. దేవత, అగ్నిసాక్షి సీరియల్ హీరో వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతున్నారు. అంబటి అర్జున్, పూర్ణ కాంబినేషన్‌లో సుందరి అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పూర్ణ నిన్న చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ కథకు పెద్ద హీరోయిన్‌ను తీసుకోవచ్చు. కానీ నన్ను తీసుకున్నారు. ఇలా లీడ్ రోల్ పోషించేంత పెద్ద హీరోయిన్‌ను నేను కాదంటూ పూర్ణ చెప్పుకొచ్చారు. అయినా కూడా నిర్మాత రిజ్వాన్ నా మీద నమ్మకంతో ఈ పాత్రను నాకు ఇచ్చారు. ఈ పాత్రను చేయడానికి కారణం నయనతార. ఆమె ఎంచుకునే పాత్రలు, చేసే సినిమాలు నాలో స్ఫూర్తినింపాయి. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేయగలమన్న నమ్మకాన్ని ఇచ్చాయి. అందుకే ఈ చిత్రాన్ని నేను చేశాను. మాది చాలా చిన్న సినిమా అందరూ సహకరించండి అని పూర్ణ కోరుకున్నారు. కల్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించారు. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. మరి ఈ చిత్రం పూర్ణకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
By August 02, 2021 at 09:41AM
No comments