Breaking News

Happy Birthday Devi Sri Prasad: అప్డేట్ అంటూ రచ్చ.. అభిమానుల్లో జోష్ నింపిన ‘పుష్ప’ టీం


HBD DSP: రాక్ స్టార్ బర్త్ డే నేడు (ఆగస్ట్ 2). ఈ క్రమంలో ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారంతా ఒకపక్క. అయితే మరో వైపు ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తగ్గ్యేదేలే అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు. అయితే ఫ్యాన్స్ వేస్తున్న ట్వీట్లకు, చేస్తోన్న పోస్ట్‌లకు పుష్ప టీం వెంట వెంటనే రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో అప్డేట్ ఉండబోతోందనే సంకేతాలను ఇచ్చేసింది. చూస్తుంటే దేవీ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలు, ఆ ట్యూన్స్‌కు సంబంధించిన వివరాలను అల్లు కాంపౌండ్ పరోక్షంగా లీక్ చేసింది. పుష్ప పాటలు కొన్నేళ్లు అలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.. అద్బుతంగా వచ్చేశాయ్ అని..ఇక దేవీ ప్రసాద్ టైం మళ్లీ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అయినా సుకుమార్ అల్లు అర్జున్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబో అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పుష్ప చిత్రంతో దేవీ శ్రీ ప్రసాద్ ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో అదరగొట్టబోతోన్నారు. ఈ బర్త్ డే సందర్భంగా రాక్ స్టార్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ వదలబోతోన్నట్టు తెలుస్తోంది. మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అప్డేట్ ఎప్పుడు వస్తుంది? అసలు అప్డేట్ ఉందా? ఫస్ట్ సింగిల్ రాబోతోందట కదా? అని అభిమానులు అడుగుతూ ఉంటే.. వాటికి పుష్ప టీం ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం ఫన్నీ జిఫ్ ఫైల్‌ను షేర్ చేస్తున్నారు. అవును అప్డేట్ ఉంటుందని చెబుతూ అభిమానుల్లో జోష్ నింపేస్తున్నారు. ఈ మధ్య సుకుమార్‌కు ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


By August 02, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-pushpa-first-single-update-on-dsp-birthday/articleshow/84963805.cms

No comments