Breaking News

Plastic Ban ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది జులై నుంచే అమల్లోకి!


ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జులై నుంచి ‘’పై నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటి తయారీ, ఎగుమతి, పంపిణీ, అమ్మకాలు, వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్లాస్టిక్ కవర్లను ఒకసారి వాడిపడేయకుండా మళ్లీ మళ్లీ వినియోగించేలా ప్రస్తుతం ఉన్న 50 మైక్రాన్లను 70 మైక్రాన్లకు పెంచింది. తాజా నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి రానుంది. అనంతరం వచ్చే ఏడాది డిసెంబరు 31 నుంచి వీటిని 120 మైక్రాన్లకు పెంచనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ‘థర్మాకోల్ సహా ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ప్లాస్టిక్‌ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతి, పంపిణి, అమ్మకం, వినియోగంపై నిషేధం జులై 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది’ అని పేర్కొంది. ‘స్టిక్స్‌తో కూడిన ఇయర్‌ బడ్స్‌, గాలి బుడగల కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, ఐస్‌క్రీం స్టిక్‌లు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాస్‌లు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్‌ బాక్సులు, బాక్సుల ప్యాకింగ్‌ కోసం చుట్టే ప్లాస్టిక్‌పేపర్‌, ఫిల్మ్‌లు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్‌ ప్యాక్‌లు, 100 మైక్రాన్‌లకు లోపు బరువుండే ప్లాస్టిక్‌, పీవీసీ బ్యానర్లకు నిషేధం వర్తిస్తుంది’ అని తెలిపింది. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లను ఒకసారి వాడిపడేయకుండా మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుగా సెప్టెంబరు 30 నుంచి క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 మైక్రాన్ల నుంచి 75 మైక్రాన్లకు పెంచనుంది. డిసెంబర్‌ 31 నుంచి వీటి మందం 125 మైక్రాన్లకు పెరగనుంది. అలాగే, పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమావళి 2016 ప్రకారం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వ్యర్థాలను దశలవారీగా ఉత్పత్తిదారు, దిగుమతిదారు, బ్రాండ్ యజమాని పర్యావరణ అనుకూలమైన రీతిలో సేకరించి నిర్వహించాలి. ఉత్పత్తిదారుడు బాధ్యతను సమర్థవంతంగా అమలు చేయడం కోసం చట్టపరమైన నిబంధనలను సవరించి మార్గదర్శకాలను తీసుకొచ్చామని పేర్కొంది. పాలసీ ప్రకారం వినియోగదారులకు ఉపయోగకరమైనవిగా పేర్కొనని తర్వాత ఉత్పత్తి చేసే ఉత్పత్తుల నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత పూర్తిగా తయారీదారులదే.


By August 14, 2021 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/single-use-plastic-items-will-be-banned-from-july-1-2022-says-centre-notification/articleshow/85318564.cms

No comments