Paagal Twitter Review: ఫస్టాఫ్ అలా.. సెకండాఫ్ ఇలా! విశ్వక్ అంత చెప్పాక ఆడియన్స్ ఏమంటున్నారంటే..
విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘’. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లవర్ బాయ్ లుక్స్ సినిమా పట్ల అంచనాలు పెంచేయగా, ఎంతో కాన్ఫిడెంట్‌గా 'సినిమా హిట్ పక్కా.. లెక్కతప్పితే పేరు మార్చుకుంటా రాసుకోండి' అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై విశ్వక్ చెప్పిన మాటలు సినిమాకు బెస్ట్ ప్రమోషన్ కల్పించాయి. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ పాగల్‌పై పడింది. భారీగా కాకపోయినా చెప్పుకోదగిన అంచనాల నడుమ ఈ రోజు (ఆగస్టు 14) పాగల్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఓవర్‌సీస్ ఆడియన్స్, ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు సినిమాపై, విశ్వక్ నటనపై ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మరి అవేంటో.. సినిమా ఎలా ఉందని అంటున్నారో ఓ లుకేద్దామా.. పాగల్ ఫస్టాఫ్ ఓకే కానీ సెకండాఫ్ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా బోర్ కొట్టిందని, కథను స్లోగా నడిపించారనే అభిప్రాయలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందట. అలాగే చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయని, ఓవరాల్‌గా చెప్పాలంటే యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా అని అంటున్నారు. సినిమా కొత్తగా ఉందని, హీరో విశ్వక్ సేన్ నటనతో పాటు కామెడీ అదుర్స్ అని అంటున్నారు. మరోవైపు కొన్ని నెగెటివ్ ట్వీట్స్ కూడా కనిపిస్తున్నాయి. లవర్ బాయ్ రోల్ విశ్వక్ సేన్‌కి అస్సలు సూట్ కాలేదంటూ ఆడుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ చిత్రంలో సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
By August 14, 2021 at 07:34AM
No comments