Pawan Kalyan: ఇది మాస్ కాదు.. అంతకు మించి.. ‘భీమా నాయక్’ టీజర్.. బొమ్మ దద్దరిల్లిపోయింది
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు వింటేనే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలతో పాటు నానా హంగామా చేస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం రాజకీయాల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ‘వకీల్‌సాబ్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న పవన్ ఆ తర్వాత వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ ఒకటి. ‘ప్రొడక్షన్ నెం.12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ‘భీమ్లా నాయక్’ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు.. ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ చిన్న మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ పవన్ అభిమానులు స్వాతంత్ర్య దినోత్సవ కానుక అందించింది. సినిమా నుంచి ‘భీమా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లుంగీ కట్టులో మాస్ లుక్‌లో పవన్ ఈ టీజర్‌లో అదిరిపోయారు. ‘రేయ్ డాని బయటకు రారా’ అనే డైలాగ్‌తో ప్రారంభం అయిన ఈ టీజర్‌లో పవన్ యాక్షన్ మరో లెవల్‌లో ఉంది. చివర్లో విలన్ ‘డాని.. డానియల్ శేఖర్’ అని అంటే.. పవన్ ‘భీమా.. భీమా నాయక్’ అంటూ మాస్ జవాబు ఇస్తారు. ఈ డైలాగ్ తర్వాత ‘’ అంటూ టైటిల్ వస్తుంది. చివర్లో ‘ఏంటీ చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు బండెక్కు’ అంటూ డైలాగ్ చెప్తారు పవన్. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో పాటు సినిమాను జనవరి 12, 2021కి విడుదల చేస్తున్నామని ప్రకటించిన చిత్ర యూనిట్.. పాటలను సెప్టెంబర్ 2 నుంచి విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీ నిత్య మీనన్, హీరో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
By August 15, 2021 at 09:59AM
No comments