Breaking News

దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలు


రవి అస్తమించని బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించి నేటికి 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు త్యాగం చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై చేసిన పోరాటం ఫలితంగా 1947, ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. దీంతో ఆదివారం దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరు జాతీయ జెండాను ఎగరేసి.. దేశం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మన సినిమా సెలబ్రిటీలు కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ సందర్భంగా అందరిని అనేకానేకా శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ బిగ్‌బి ట్వీట్ చేశారు. దీంతో పాటు ఆయన త్రివర్ణలో కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. ఇక సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా ప్రజలకు విషెస్ తెలిపారు. ‘స్వాతంత్య్రం మనందరిని ఐకమత్యంగా ఉంచి.. అభివృద్ధి వైపు అడుగులు వేయించాలి.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మహేష్ పేర్కొన్నారు. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ సింపుల్‌గా ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమిళ స్టార్ హీరో ఆర్. మాధవన్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికీ గర్వంగా, సంతోషంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాను’ అంటూ ఆయన పేర్కొనారు. ఇక నటుడు సుధీర్‌ బాబు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తన కొన్ని రోజుల క్రితం స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా భారత సైన్యం అధ్వర్యంలో నిర్వహించిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొన్నాను అంటూ ఆయన తెలిపారు. దీనికి సహకరించిన డీపీఆర్‌ఓకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పారు.


By August 15, 2021 at 10:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/movie-celebrities-wishes-people-on-independence-day/articleshow/85343293.cms

No comments