Breaking News

Maha Samudram: రంభ మాయలో జగపతిబాబు.. మందేసి చిందేస్తూ హాట్ బ్యూటీ జపం!! వీడియో వైరల్


సీనియర్ హీరో జగపతిబాబు మాయలో పడిపోయారు. మందేసి చిందేస్తూ ఆమె జపమే చేస్తున్నారు. అందాల రంభ అంటే పడిచస్తానంటూ తెగ హంగామా చేశారు ఈ సీనియర్ హీరో. ఆయనొక్కడే కాదండోయ్ పక్కనే యంగ్ హీరో కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ మత్తులో తేలుతూ హే రంభ.. రంభ అంటూ ఫుల్ హంగామా చేశారు. ఇదంతా ఎక్కడో కాదండోయ్! '' సినిమాలోని ఓ పాటలో. Rx 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'మహా సముద్రం'. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ అంచనాలు పెంచేయగా తాజాగా ''హే రంభ.. రంభ'' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. రంభ మాయలో పడిన యువకుడిగా ఆయన కనిపించారు. అప్పట్లో రంభతో కలిసి పలు సినిమాల్లో తెరపంచుకున్న జగపతిబాబును ఆమె ఫ్యాన్‌గా ఈ సినిమాలో ప్రెజెంట్ చేయబోతున్నారట అజయ్ భూపతి. ఈ మేరకు ఇలా స్పెషల్ సాంగ్‌‌ ప్లాన్ చేసి రంభ అందాలను పొగుడుతూ జగపతిబాబును డిఫరెంట్‌గా చూపించారు. భాస్కర భట్ల అందించిన లిరిక్స్‌పై చైతన్ భరద్వాజ్ పాడిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ కావడం విశేషం.


By August 06, 2021 at 10:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hey-rambha-rambha-lyrical-released-from-sharwanands-maha-samudram/articleshow/85091652.cms

No comments