ఇలా ఉందేంటి ఈమె అనసూయేనా..? పుష్ప సెట్స్ నుంచి ఫొటోస్ లీక్.. జబర్దస్త్ బ్యూటీపై దారుణంగా ట్రోల్స్
జబర్దస్త్ బ్యూటీగా బుల్లితెరపై హంగామా చేస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా మెప్పించిన ఆమె.. మరోసారి అదే సుకుమార్ డైరెక్షన్‌లో '' మూవీలో భాగమవుతోంది. అయితే తాజాగా 'పుష్ప' సెట్స్ నుంచి ఫొటోస్ లీక్ కావడంతో అవి చూసి షాకవుతున్నారు జనం. వీటిపై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. కెరీర్ పరంగా చూస్తే అనసూయకు రంగమ్మత్త క్యారెక్టర్ చాలా ప్లస్ అయింది. ఆమె లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ డిఫరెంట్ యాంగిల్‌లో కెమెరా ముందుకు తీసుకొచ్చారు సుక్కు. దీంతో మరోసారి అదే సుకుమార్ సినిమాలో అనసూయ నటిస్తోందనే సరికి అందరిలో ఒకింత ఆసక్తి నెలకొంది. ఈ సారి అనసూయను ఎలా చూపెడతారనే క్యూరియాసిటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఇటీవలే సెట్స్ మీదకొచ్చిన అనసూయ పిక్స్ బయటకొచ్చాయి. వీటిలో ఆమె లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. బాయ్‌కట్ హెయిర్ స్టైల్‌లో మాస్ లుక్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసి ఇలా ఉందేంటి ఈమె అనసూయేనా..? అంటున్నారు నెటిజన్లు. ఇక ట్రోలర్స్ రంగంలోకి దిగి ఆ లుక్కేంటి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె లుక్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ భార్యగా అనసూయ నటిస్తోందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నారు సుకుమార్. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండాగా, ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
By August 06, 2021 at 09:35AM
No comments