విడాకులిచ్చి మరో వ్యక్తితో ప్రేమపెళ్లి.. పగబట్టిన మాజీ భర్త, ఇంట్లోకి దూరి 27సార్లు కసితీరా..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంక పాశవికంగా హతమార్చాడు. అతని దాడిలో గాయపడి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను వెంటాడి మరీ ఏకంగా 27సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. హతురాలి రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: జిల్లాలోని థారా గ్రామానికి చెందిన అజయ్ ఠాకూర్ అనే వ్యక్తికి హేమ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొన్నాళ్ల సాఫీగా సాగిన వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన హేమ అతడికి దూరంగా బ్రతకాలనుకుంది. పిల్లలను భర్త వద్ద ఉంచి తాను కొన్నాళ్లు విడిగా బ్రతికింది. అనంతరం విడాకులు తీసుకుని మహేష్ ఠాకూర్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన భార్య విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో అజయ్ ఠాకూర్ మద్యానికి బానిసయ్యాడు. తనకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన హేమను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి చెప్పి ప్లాన్ వేశాడు. బుధవారం రాత్రి అజయ్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ ఇంటికి వెళ్లాడు. రెండో భర్త ఇంట్లో లేడని తెలుసుకొని ఒక్కసారిగా మాజీ భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా అజయ్ స్నేహితులు అడ్డుకున్నారు. Also Read: తనను చంపొద్దని హేమ ఎంత బ్రతిమాలినా అజయ్ వినిపించుకోకుండా ఆమెను వెంటాడి అత్యంత కిరాతకంగా 27సార్లు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అజయ్, అతడి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రెండో భర్త రక్తపు మడుగులో పడివున్న భార్యను చూసి షాకయ్యాడు. వెంటనే మహేష్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:
By August 06, 2021 at 11:21AM
No comments