HBD Supritha : మీ నాన్న అలా పిలిచే వారు!!.. సుప్రిత బర్త్ డేపై సురేఖా వాణి ఎమోషనల్
నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఆమె కూతురు సుప్రిత సైతం సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ తల్లీకూతుళ్లు చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను ఎదుర్కొంటారు. ఈ ఇద్దరి వస్త్రాధారణ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. ఇక సుప్రితకు గోవా అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా గోవాకు వెళ్తుంటారు. గోవా బీచుల్లో సురేఖా వాణి, సుప్రిత చేసే రచ్చ మామూలుగా ఉండదు. అక్కడి పబ్బుల్లో ఈ తల్లీకూతుళ్లు నానా హంగామా చేస్తుంటారు. నేడు సుప్రిత బర్త్ డే. ఈ క్రమంలోనే గోవాలో సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసేశారు. ఇందుకోసం సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కూడా నిన్ననే గోవాకు చెక్కేశారు. అక్కడ ప్రస్తుతం ఈ ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే కూతురు బర్త్ డే సందర్భంగా సురేఖా వాణి వేసిన డ్రెస్సు, చేసిన డ్యాన్సు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా సుప్రిత బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ సురేఖా వాణి ఎమోషనల్ అయ్యారు. సుప్రిత తండ్రి, తన భర్తను గుర్తు చేసుకున్నారు. సుప్రితను తన తండ్రి ఎంత ప్రేమగా పిలిచేవారో గుర్తుకు చేసుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే కన్నా (చిట్టి తల్లి మా) మీ డాడీ ఇలానే నిన్ను పిలిచేవారు. మనం ఆయన్ను ఎంతగా మిస్ అవుతున్నామో మనకు తెలుసు. నేను నా పరిధిలో నిన్ను బాగా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తివి నువ్వే. నా జీవితంలో దొరికిన అదృష్టానివి నువ్వే అని నిస్సందేహంగా చెప్పగలను. ఈ ప్రపంచంలోనే కూతళ్లందరిలో బెస్ట్ అయిన కూతురిని నాకు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ జీవితంలో నీ కంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించలేదు. రాబోయే జన్మలోనూ ఇంకా ఎవ్వరినీ ఇంతగా ప్రేమించకపోవచ్చు. నీకు ఎప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సురేఖా వాణి ఎమోషనల్ అయ్యారు.
By August 08, 2021 at 02:26PM
No comments