హీరోయిన్లను అలా చూడటం అలవాటు.. కాలేజీ టైమ్ నుంచే అలాంటి బుద్ది! హీరోయిన్ ముందే ఆర్జీవీ ఓపెన్
సినిమాలు తెరకెక్కించడంలో ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తారో.. మాట్లాడటంలోనూ అంటే డిఫరెంట్ ధోరణిలో వెళుతుంటారు రామ్ గోపాల్ వర్మ. సమాజంలోని అన్ని విషయాలపై ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతుంటారో ఎవ్వరూ ఊహించలేరు. మనసులో ఏదీ దాచుకోకుండా ఓపెన్‌గా చెప్పేయడం ఆయన స్టైల్. ముక్కుసూటిగా ఉంటూ వ్యక్తిగతంగా మాత్రం తన పంథా తనదే అన్నట్లుగా ఆయన దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఏకంగా హీరోయిన్ ముందే చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ బోల్డు మాటలతో పిచ్చెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ‘' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వచ్చి ఆ సినిమా హీరోయిన్ ముందే ఓపెన్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరిగింది. దీనికి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను సినిమాలో కేవలం హీరోయిన్‌ని మాత్రమే చూస్తానంటూ ఓపెన్ అయ్యారు. మొదటి రెండుసార్లు హీరోయిన్ కోసమే చూస్తానని అన్నారు. ఇది తన కాలేజ్ టైమ్ నుంచే ఉన్న బుద్ది అంటూ అందరి ముందే ఓపెన్ అయ్యారు. ఇక ఈ సినిమా హీరోయిన్ వైశాలి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, కైపెక్కించే కళ్ళతో మాయ చేస్తున్నావని ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చారు వర్మ. దీంతో ఆ హీరోయిన్ సిగ్గుమొగ్గలేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్, హిమజ ప్రధాన పాత్రల్లో ఈ 'కనబడుటలేదు' సినిమా రూపొందించారు. ఎమ్ బాలరాజు తెరకెక్కించిన ఈ సినిమాను స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో సతీష్, దిలీప్, శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By August 08, 2021 at 02:43PM
No comments