HBD Radha Krishna Kumar : రాధేశ్యామ్ అప్డేట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి
ట్విట్టర్ ప్రపంచంలో అభిమానులు ఎలా సందడి చేస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు హీరోల ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాను తెగ వాడేస్తుంటారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినీ అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలా అప్డేట్లు ఆలస్యమైతే.. దర్శకనిర్మాతలను ఓ ఆట ఆడుకుంటారు. ఆ విషయంలో అభిమానులు మాత్రం ఎన్నో సార్లు రాధేశ్యామ్ టీంను వాయించేశారు. అప్డేట్ అంటూ యూవీ క్రియేషన్స్‌ను, దర్శకుడు రాధాకృష్ణకుమార్‌ను తెగ ట్రోల్ చేసేశారు. నేడు (ఆగస్ట్ 2) బర్త్ డే. ఈ సందర్భంగా నేడు ఆయన పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. HBDRadhaKrishnaKumar అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అది మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది సాధ్యం కాదు. కానీ ప్రభాస్ అభిమానుల దెబ్బకు రాధాకృష్ణ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. అయితే డార్లింగ్ అభిమానులు మాత్రం ఏదో ఒక అప్డేట్ ఆశిస్తున్నారు. దర్శకుడు బర్త్ డే సందర్భంగా ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వండని కోరుతున్నారు. ఇక ప్రభాస్ ఎప్పుడు తన దర్శకుడి గురించి చెబుతూ పోస్ట్ పెడతాడా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క జిల్ సినిమాతోనే ఇంతటి క్రేజ్ దక్కించుకోవడం, రెండో చిత్రంతోనే ప్యాన్ ఇండియాకు వెళ్లడం మామూలు విషయం కాదు. రాధాకృష్ణకుమార్ తెరకెక్కించి రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతిన జనవరి 14కు రాబోతోంది.
By August 02, 2021 at 08:44AM
No comments