Pawan Kalyan: ఎప్పటికీ చెరిగిపోవు.. పవన్ కళ్యాణ్‌పై అలీ కామెంట్
టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంతో మంది పేర్లు వినిపించవచ్చు. ఎంతో మంది స్నేహితులుగా ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్, అలీల స్నేహం గురించి తెలియని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. వీరి స్నేహబంధం కూడా ప్రత్యేకమైంది. సినీ కెరీర్ ప్రారంభించక ముందు నుంచీ ఆయన అలీకి తెలుసు. చిరంజీవి కోసం ఇంటికి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్‌ను చూసేవాడట ఆలీ. అలా చివరకు ఈ ఇద్దరే ఎంతో సన్నిహితులయ్యారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతీ సినిమాలో ఉండాల్సిందే. ఆయన కోసం రచయితలు ఓ పాత్రను రాయాల్సిందే. అలా దాదాపు పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాల్లో ఆలీ ఉంటారు. అయితే ఈ ఇద్దరి స్నేహానికి మధ్యలో భీటలువారాయి. రాజకీయాల వల్ల ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. స్నేహితులు కూడా నన్ను వదులుకున్నారు.. లైఫ్ ఇచ్చాను.. అంటూ ఇలా పవన్ కళ్యాణ్ అనడం, తనకు ఎవ్వరూ కూడా లైఫ్ ఇవ్వలేదని, ఆయన సినిమాల్లోకి రాక ముందు నుంచే తాను పరిశ్రమలో ఉన్నానని ఆలీ కౌంటర్ వేశారు. ఇలా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేమికుడు సైతం ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా కేవలం రాజకీయ పరంగానే గానీ వారింకా మంచి స్నేహితుల్లానే ఉన్నారని అంటుంటారు. ఆ మధ్య రెండుమూడు సార్లు పవన్ కళ్యాణ్ ఆలీ కలుసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. తాజాగా ఆలీ ఈ స్నేహితుల సందర్భంగా ఓ పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్‌తో సినిమాల్లో నటించిన సీన్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. నీ లాంటి ఫ్రెండ్ ఎప్పుడూ గుండెల్లోనే ఉంటాడు.. నీతో ఉన్న క్షణాలన్నీ ఎప్పటికీ చెరిగిపోవు.. హ్యాపీ అని చెప్పుకొచ్చారు.
By August 02, 2021 at 08:16AM
No comments