Chiranjeevi : PV Sindhuకు చిరు స్పెషల్ పార్టీ.. రాధికపై ట్రోలింగ్.. సీనియర్ నటి కౌంటర్!
సోషల్ మీడియాలోని జనాలు మామూలు వాళ్లు కాదు. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే కనిపెట్టేస్తారు. ఆ తప్పును వేలెత్తిచూపుతారు. ఇక సెలెబ్రిటీల విషయంలో అయితే నెటిజన్లు మరింత స్పీడుగా ఉంటారు. వారి తప్పులెంచుతూ ఏకిపారేస్తుంటారు. తాజాగా సీనియర్ నటి రాధికను ట్రోలర్లు ఆడుకుంటున్నారు. గెలిచిన పతకం ఏంటో కూడా తెలియకుండానే.. ఆమెను అభినందిస్తున్నావా? అంటూ రాధికపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ తారలు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో పీవీ సింధు మెరిసిపోతోన్నారు. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోన షేర్ చేస్తూ వేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. పీవీ సింధును పొగుడుతూ రాధిక ట్వీట్ చేశారు. అయితే, పీవీ సింధు గెలిచింది స్వర్ణం పతకం అంటూ రాధిక ట్వీట్ చేశారు. 'పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది' అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. ఇక దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కనీసం ఆమె గెలిచిన పతకం ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు అంటూ కామెంట్లు పెట్టసాగారు. అయతే వీటిపై సీనియర్ నటి స్పందించారు. ఆ కాంస్య పతకమే బంగారు పతకం కంటే గొప్పది.. పీవీ సింధులోని ఆ ఫీలింగ్స్, ఆమె సంతోషమే అది తెలియజేస్తోంది అని ట్రోలర్లకు సమాధానం ఇచ్చారు.
By August 21, 2021 at 07:57AM
No comments