బండ్లన్న కొత్త అవతారం.. హీరోగా దుమ్ము లేపేందుకు బడా నిర్మాత రెడీ
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఎన్నో సినిమాల పేర్లు తెరపైకి వచ్చాయి. తమిళ సినిమాకు రీమేక్ అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని బండ్ల గణేష్ కొట్టిపారేశారు. అయితే తాజాగా మాత్రం అధికారిక సమాచారం వచ్చినట్టు అయింది. బండ్ల గణేష్ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పరోక్షంగా రియాక్ట్ అవుతున్నారు. హీరోగా రాబోతోన్న వార్తలు, నెటిజన్లు వేస్తున్న ట్వీట్లకు ఆయనిచ్చే రియాక్షన్లు బట్టి ఆ వార్తలు నిజమే అని అర్థమవుతోంది. ఇక ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా, నిర్మాతగా ఆయనుకున్న క్రేజ్ వేరే అయితే.. స్టేజ్ ఎక్కితే మైకు అందుకుని దంచే స్పీచులకు ఇంకో లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది. మాటల రచయితగా ట్రై చేయ్ బండ్లన్న అంటూ అభిమానులు సలహాలు ఇస్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేయబోతోన్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం. ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ రీమేక్‌తో బండ్లన్న కొత్త అవతారమెత్తబోతోన్నారు.
By August 21, 2021 at 07:15AM
No comments