Bommireddy Raghava Prasad Death: సినీ నిర్మాత, నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత


గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి విజృంభణలో కొందరు, అనారోగ్య కారణాలతో ఇంకొందరు ప్రముఖులు మృతి చెందారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలోని చాలామంది నటీనటులు కన్నుమూస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నిర్మాత, నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యం బాధపడుతూ నేడు (శుక్రవారం) తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆయన.. (కొత్త సినిమా) సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, బంగారు బుల్లోడు, దొంగల బండి, సౌర్య చక్ర, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
By August 06, 2021 at 08:38AM
No comments