Breaking News

కొడుకుపై రేణు దేశాయ్ ప్రేమ.. అకీరా నందన్ వైరల్ వీడియో! పవన్ కళ్యాణ్‌ని మించి పోయేలా ఉన్నాడే!!


పవన్ కళ్యాణ్ కొడుకు విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. తల్లిదండ్రులు పవన్- విడిపోయాక తల్లి రేణు దగ్గరే పెరిగిన ఈ కుర్రాడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మంచి హైట్‌తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌తో ఆకర్షిస్తున్నాడు. పైగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సినీ వారసుల్లో ఎంట్రీకి సిద్ధంగా ఉన్న వారసుల లిస్టులో అకీరా పేరు కూడా ఉండటంతో అతనికి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన అకీరా కర్రసాము వీడియో పవన్ అభిమానులను ఫిదా చేస్తోంది. అకీరా సినీ ఎంట్రీ అనే అంశం ఎప్పినుంచో చర్చల్లో నిలుస్తుండగా, రీసెంట్‌‌గా అకీరా లుక్ చూసి ఆయన సినిమాల్లోకి వస్తే సంచలనాలు ఖాయం అని ఫిక్సయ్యారంతా. ఇంకా రెండు పదుల వయసులోకి కూడా ప్రవేశించకముందే అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఊహాగానాలు మిన్నంటుతున్నాయి. ఇదిలాఉంటే మరోవైపు ఒక్కొక్కటిగా తన టాలెంట్ బయటపెడుతూ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు అకీరా. తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోయేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అకీరా కర్రసాము చేస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ కొడుకుపై ప్రేమ కురిపించింది రేణు దేశాయ్. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయి పవన్ అభిమానుల్లో వైబ్రేషన్స్ తెచ్చింది. ఇందులో అకీరా కర్రసాము చేస్తున్న విధానం చూసి.. రాబోయే రోజుల్లో ఆయన కూడా తండ్రిలాగే వెండితెరను ఉర్రూతలూగిస్తాడని చెప్పుకుంటున్నారు. అకీరా త్వరలో సినిమాల్లోకి రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అకీరా సినీ ఎంట్రీ గురించిన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకైతే ఆయన సినిమాల్లోకి రాబోతున్నట్లు ఎక్కడా ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు రేణు. అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది అతని ఛాయిస్ అని గతంలోనే ఆమె చెప్పారు. సో.. చూడాలి మరి ఇంత టాలెంట్ ఉన్న మెగా కుర్రోడు కెమెరా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్‌ని మించి పాపులర్ అవుతాడా లేదా? అనేది!.


By August 03, 2021 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-son-akira-nandan-martial-arts-video-viral/articleshow/84998309.cms

No comments