ఆరో పెళ్లికి సిద్ధపడ్డ మాజీ మంత్రి.. ఇంతలో షాక్ ఇచ్చిన మూడో భార్య!
ఆరో పెళ్లికి సిద్ధమైన ఓ మాజీ మంత్రికి అతడి మూడో భార్య ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. మూడో ఫిర్యాదు చేయడంతో పెళ్లిని అడ్డుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ విషయం తెలుసుకున్న అతడి మూడో భార్య నగ్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్ చౌదరి తనను 2012లో వివాహం చేసుకున్నట్టు నగ్మా తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం తర్వాత తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపించింది. బలవంతంగా తనను అనుభవించేవాడని వాపోయింది. మహిళలను హింసించడం ఆయనకు చాలా ఇష్టమని సంచలన ఆరోపణలు చేసింది. చౌదరి బషీర్ షయిష్ట అనే మరో అమ్మాయిని ఆరో వివాహం చేసుకుంటున్నట్టు జులై 23న తనకు తెలియడంతో నిలదీశానని పేర్కొంది. అడిగినందుకు తనను తీవ్రంగా కొట్టి హింసించాడని వివరించింది. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు గెంటేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. దీంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లిని అడ్డుకున్నారు. ముస్లిం మహిళా వివాహ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ మాజీ మంత్రి చౌదరి బషీర్‌పై ఈ తరహా కేసు నమోదవగా.. 23 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మాజీ మంత్రిపై మాంటోలా స్టేషన్‌లో కేసు నమోదయినట్టు ఆగ్రా ప్రత్యేక ఎస్పీ తెలిపారు. చౌదరి బషీర్‌పై ఆరోపణలు చేస్తూ నగ్మా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ విషయంలో పోలీసుల సాయం కోరింది. తొలుత బీఎస్పీలో ఉన్న చౌదరి బషీర్.. మాయావతి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తర్వాత బీఎస్పీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆ పార్టీ నుంచి కూడా బయటకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారనేది మాత్రం తెలియదు. అయితే, బషీర్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదయినట్టు పోలీసులు తెలిపారు
By August 03, 2021 at 11:00AM
No comments