Breaking News

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిన అడవిశేష్. ఈ నెలలోనే ప్రకటన అంటూ పోస్ట్


రొటీన్ సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కథాంశంతో.. సినిమాలు ప్రేక్షకులను అందించడంలో హీరో అడవి శేష్ ముందుంటారు. ఆయన చేసే ఒక సినిమాకి మరో సినిమాకు ఎంతో తేడా ఉంటుంది. ఎక్కువశాతం దేశభక్తి, థ్రిల్లర్ జోనర్‌లో ఆయన సినిమాలు తీస్తుంటారు. ఇప్పటివరకూ వచ్చిన ‘క్షణం’, ‘ఎవరు’ తదితర సినిమాలు ప్రేక్షకులను ఎంత ఆకట్టుకున్నాయి అంటే తర్వాత మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఆయన ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మేజర్’. ఈ సినిమాలో సైయూ మంజ్రేకర్, శోభితా ధూళిపాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా తన సూపర్‌హిట్‌ సినిమా ‘గూఢచారి’ విడుదల అయ్యి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అడవి శేష్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇది తాను ఎంతో ప్రేమించిన సినిమా అని ఆయన పేర్కొన్నారు. ఇది సినిమాను పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు అని ఆయన అన్నారు. అయితే ఆగస్టు నెల తనకు ఎంతో కలిసి వచ్చింది అని అందుకే ఇదే నెలలో మరో ప్రకటన చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ‘గూఢాచారి’ మళ్లీ రాబోతున్నాడు అని స్పష్టం చేశారు. అడివి శేష్ పెట్టిన ఈ పోస్ట్ చూస్తే.. కొన్ని రోజుల్లోనే ‘గూఢాచారి-2’పై ప్రకటన వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. మరి దానిపై ప్రకటన వచ్చే వరకూ మనందరం ఎదురుచూడాల్సిందే.


By August 03, 2021 at 11:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/adivi-sheh-gives-latest-update-about-his-new-movie/articleshow/84998409.cms

No comments