తన ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన నిఖిల్.. మరో డిఫరెంట్ సినిమా సైన్ చేశానంటూ పోస్ట్
‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో . తొలి సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కామెడీ ఆధారంగా ఎక్కువశాతం సినిమాలు చేశారు అయన.. ఆ తర్వాత రొటీన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో సినిమాలు చేయడం ప్రారంభించారు. ‘స్వామి రారా’ సినిమాతో బ్రేక్ రావడంతో.. ఆ తర్వాత డిఫరెంట్ జానర్‌లలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన ‘కార్తీకేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే హీరోగానే కాకుండా ఓ మంచి మనస్సున వ్యక్తిగా కూడా నిఖిల్ గుర్తింపు సంపాదించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సహాయం చేసి రియల్ హీరో అయిపోయారు. ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి సోషల్‌మీడియా ద్వారా అవసరంలో ఉన్న వాళ్ల సమాచారం తెలుసుకొని వారికి సహాయం అందించారు. ఇక ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి.. ‘కార్తీకేయ’ సినిమా సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాతో పాటు ‘18 పేజెస్’ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే ‘18 పేజెస్’ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదల అయ్యి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా నిఖిల్ తన తదుపరి సినిమా గురించి ప్రకటించారు. తాను త్వరలో ఓ సినిమాలో నటిస్తున్నాను అని నిఖిల్ తెలిపారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన కొత్త సినిమా సైన్ చేశాను.. ఇది స్పై థ్రిల్లర్’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు ‘హిట్’, ‘ఎవరు’ లాంటి థ్రిల్లర్ సినిమాలకు వర్క్ చేసిన ఎడిటర్ గ్యారీ బి హెచ్ డైరెక్షన్ చేయనున్నారు. ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ నెం.2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాని చిత్రాన్ని రెడ్ సినిమాస్ బ్యానర్ పై కే రాజా శేఖర్ రెడ్డి నిర్మాణం వహించనుండగా సినిమా ఇతర క్యాస్టింగ్ మరియు మిగతా టెక్నీకల్ టీం వివరాలు త్వరలోనే రానున్నాయి.
By August 15, 2021 at 12:28PM
No comments