Breaking News

అందరాబ్ లోయలో దయనీయ పరిస్థితి.. ఆహారం సరఫరా నిలిపివేసిన తాలిబన్లు


తాలిబన్లపై అఫ్గనిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, అహ్మద్ మసూద్‌లు నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందారబ్ లోయలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నార్తర్న్ బఘ్లాన్ ప్రావిన్సుల్లోని అందారబ్ లోయలో హృదవిదారక పరిస్థితి నెలకుందని, తాలిబన్లు మానవహక్కుల ఉల్లంఘనకు తెగబడుతున్నారని వెల్లడించారు. పంజ్‌షీర్ లోయపై పట్టు సాధించడానికి తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను అక్కడ స్థానిక యోధులు అడ్డుకుంటున్నారు. ‘అందరాబ్ లోయకు తాలిబన్లు ఆహారం, ఇంధనాన్ని అనుమతించడం లేదు.. హృదవిదారక పరిస్థితి ఉంది.. వేలాది మంది మహిళలు, పిల్లలు కొండలపైకి వెళ్లిపోతున్నారు.. గత రెండు రోజులుగా తాలిబన్లు చిన్నారులు, వృద్ధులను అపహరిస్తున్నారు. వారిని తమ కవచాలుగా ఉపయోగించుకుని చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. ‘అందరాబ్ లోయలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న మర్నాడు తాలిబ్‌లు పంజ్‌షీర్ సమీపంలో బలగాలను మోహరించారు.. ఇంతలో, సలాంగ్ జాతీయరహదారిని మూసివేశారు’ అని అమ్రుల్లా సలేహ్ తెలిపారు. పదివేల మంది ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి కాబూల్, కుందుజ్, హెల్మాండ్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు పదివేలకుపైగా మెడికల్ కిట్‌లను గతవారంలో డబ్ల్యూహెచ్ఓ పంపిణీ చేసింది. అయితే, సరఫరా తగ్గిపోతోందని, వాటిని తిరిగి పూరించాల్సి అవసరం ఉందని ఐరాస న్యూస్ నివేదించింది. అటు, అఫ్గన్‌ను తమ వశం చేసుకున్నా.. ఇంకా తమకు కొరుకుడు పడని పంజ్‌షిర్‌ లోయ విషయంలో తాలిబన్లు ఆచితూచి అడుగేస్తున్నారు. తాలిబన్లు తమ పూర్తి శక్తియుక్తులతో పంజ్‌షిర్‌పై పడితే.. ఆ లోయను స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టం కాదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తాలిబన్‌ సేనలు పంజ్‌షిర్‌ లోయను ఇప్పటికే చుట్టుముట్టాయి.


By August 24, 2021 at 12:59PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-not-allowing-food-fuel-to-get-into-andarab-valley-afghan-vice-president/articleshow/85587434.cms

No comments