త్వరలో గుడ్ బై చెప్పబోతున్నా.. నా లైఫ్‌లో అలాంటి వాటికి చోటే లేదు.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన
బండ్ల గణేష్.. ఈ పేరు చెబితేనే ఓ అలజడి. ఆయన మైక్ పట్టుకున్నారంటే ఇక మాటల సునామే. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే లైకుల వర్షమే. కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఆలోచన కాకపోయినా ఆ మాటలే పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తుంటాయి. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన .. తిరిగి సినిమాల్లోకి వచ్చి తన మాటల తూటాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఇక బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసే సందడి అయితే మామూలుగా ఉండదు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఆయన స్పందించే తీరు వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యం బండ్ల చేసే ట్వీట్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన షేర్ చేసే పోస్టులకు భారీ ఆదరణ దక్కడం చూస్తున్నాం. ఇటీవలే పవన్ కొత్త సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ అప్‌డేట్ ఇస్తూ 'దేవర వేట మొదలయింది' అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చిన గణేష్ తాజాగా ఆయన తాజాగా 'దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా' అంటూ పవన్ లుంగీ లుక్‌పై కామెంట్ చేశారు. ఇలా బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్‌తో పవన్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మెగా ఫ్యాన్స్ పెద్దఎత్తున బండ్ల గణేష్‌ని ఫాలో అవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. త్వరలో ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పేస్తా అంటూ అందరికీ సడెన్ షాకిచ్చారు. ''నో కాంట్రవర్సీస్.. నా లైఫ్‌లో అలాంటి వాటికి చోటు లేదు'' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. బండ్ల డిసీజన్‌పై నెటిజన్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
By August 14, 2021 at 11:43AM
No comments