Breaking News

యంగ్ హీరోతో డేటింగ్, పెళ్లి విషయమై కియారా అద్వానీ ఓపెన్.. పక్కా అదే అంటూ క్లియర్ హింట్!


ఈ రోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం, ఇష్టమైన వారితో జీవితాన్ని షేర్ చేసుకోవడం అందరిలో కామన్ అయిపొయింది. నేటితరం యువత ఎక్కువగా లవ్ మ్యారేజెస్ ఇష్టపడుతుండటం ఈ సమాజంలో చూస్తున్నాం. ఇక సినీ తారల్లో అయితే ఇదీ మరీ సర్వ సాధారణం. ఇప్పుడు కాదు పాతకాలం నుంచే ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇష్టమైన వారితో డేటింగ్ చేయడం, ఆ తర్వాత కొన్నేళ్ళకు పెళ్లి బంధంతో ఒక్కటి కావడం అనేది ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చేసి చూపించారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ తన ప్రేమ, పెళ్లి విషయమై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. అనే నటుడితో కియారా అద్వానీ కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడిపిస్తుందని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమ మత్తులో మునిగితేలుతూ డేటింగ్ చేస్తున్నారని తెగ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో చెట్టాపట్టాలేసుకు తిరగటం, హలీడే వేకషన్‌కు మాల్దివులకు వెళ్లడం, బర్త్ డే వేడుకల్లో ఎంజాయ్ చేయడం చూసి వీళ్ళ మధ్య ప్రేమ బాగా ముదిరిందని అంతా ఫిక్సయ్యారు. ఈ పరిస్థితుల నడుమనే ఈ ఇద్దరూ కలిసి రీసెంట్‌గా 'షేర్షా' మూవీ కంప్లీట్ చేశారు. ఆగస్టు 12వ తేదీన ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అయింది. దీంతో 'షేర్షా' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ.. తనకు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అవుతూనే పెళ్లి విషయం కూడా ప్రస్తావించింది. సిద్దార్థ్‌ ఫోకస్ ఎప్పుడూ నటన పైనే ఉంటుందని చెప్పిన ఆమె, ఆయన మంచి నటుడని, సిద్దార్థ్ పక్కన ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటూ సిద్దార్థ్‌తో రిలేషన్‌పై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టింది కియారా. ఇకపోతే తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు కానీ.. ఎప్పటికైనా తనది లవ్‌ మ్యారేజ్‌ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసింది. సో.. చూడాలి మరి భవిష్యత్‌లో కియారా ఎవరితో ప్రేమాయణం నడిపిస్తుందనేది. ఇక ఆమె సినిమాలంటారా.. బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అయిన ఈ బ్యూటీని డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో ఫైనల్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది కియారా.


By August 08, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kiara-advani-reaction-on-her-marriage-and-relation-with-sidharth-malhotra/articleshow/85143910.cms

No comments