Breaking News

గంటల వ్యవధిలో యువతీ, యువకుడు ఆత్మహత్య.. కారణం తెలిసి పోలీసులు షాక్


జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామనే విరక్తితో సివిల్స్ ఆశావాహులు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన చండీగఢ్‌లోని సెక్టార్ 37, 38లలో శుక్రవారం చోటుచేసుకుంది. పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి, యువకుడు నాలుగు గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో వీరిద్దరికీ యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిసింది. అయితే, బాధితులిద్దరికీ ఎటువంటి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. హరియాణాలోని సోనేపట్‌కు చెందిన అంకిత్ చహల్ (30), సెక్టార్-38లో నివాసం ఉండే సిమ్రన్ (29) యూపీఎస్సీ ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. ఈ కారణంగానే వారు ఆత్మచేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ ఈ ప్రాంతంలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అంకిత్ గత నాలుగేళ్లుగా సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం లేకపోయినప్పటికీ యూపీఎస్సీ పరీక్షల్లో వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంకిత్ బెడ్‌షీట్‌తో గురువారం రాత్రి బాత్‌రూమ్‌లో ఉరేసుకున్నాడు. పుస్తకాల కోసం అతడి గదికి శుక్రవారం ఉదయం వచ్చిన స్నేహితుడు.. లోపలి నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించాడు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. తలుపులు పగలగొట్టి చూసేసరికి అంకిత్ విగతజీవిగా పడి ఉన్నాడు. యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించి, అనేక సార్లు ఇంటర్వ్యూకు హాజరయ్యాడని తెలిపారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించకపోవడంతో తీవ్ర నిరాశ చెంది బలవన్మరణానానికి పాల్పడ్డాడు. ఇది జరిగిన నాలుగు గంటల వ్యవధిలోనే సెక్టార్ 38లో సిమ్రాన్ శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తల్లి, సోదరుడు బటయకు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఉరేసుకుంది. ఘటనా స్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. పోటీ పరీక్షల్లో వైఫల్యం చెందడంతో ఒత్తిడికి గురయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.


By August 07, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-upsc-aspirants-end-life-due-to-depression-in-chandigarh/articleshow/85120733.cms

No comments