Breaking News

కాంప్యూటేషనల్ సైన్స్‌దే ప్రస్తుత దశాబ్దం.. బెన్నెట్ వర్సిటీ స్నాతకోత్సవంలో బయోకాన్ ఎండీ


మూడో స్నాతకోత్సవంలో పలువురి ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వీరిలో ప్రముఖ వ్యాపారవేత, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, నెస్లే ఇండియా ఎండీ సురేశ్ నారాయణన్ తదితరలు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశోధనాత్మక ఆవిష్కరణల ద్వారా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పశువుల నిర్వహణ, పారిశ్రామిక ప్రాసెసింగ్, పర్యావరణ స్థిరత్వాన్ని మార్చగలమని, తద్వారా ఆర్థిక వృద్ధిని సాధించగలమని అన్నారు. ఈ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాలు సమాచార సాంకేతికతకు సంబంధించినవి, కానీ ప్రస్తుతం ప్రపంచం జీవశాస్త్రం, కాంప్యూటేషనల్ సైన్స్ యుగంలోకి ప్రవేశిస్తోందన్నారు. బయోటెక్నాలజీ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. దేశంలో బయోటెక్నాలజీకి కిరణ్ మజుందార్ షా పర్యాయపదమని బెన్నెట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభు అగర్వాల్ చెప్పారు. అధునాతన సాంకేతికత, అంతర్జాతీయ పరిశోధన సహకారంతో డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు తక్కువ ఖర్చుతో చేయగల చికిత్సలను అభివృద్ధి చేశారన్నారు. మేనేజ్‌మెంట్ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు నెస్లే ఇండియా ఎండీ సురేష్ నారాయణన్‌కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని ప్రదానం చేశారు. బెన్నెట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభు అగర్వాల్ మాట్లాడుతూ.. కార్పొరేట్ ప్రపంచంలో నారాయణన్ అద్బుత విజయాలు సాధించారన్నారు. వివిధ దేశాలు, బహుళ సంస్కృతులతో విస్తరించి ఉన్న నెస్లే సంస్థలో 35 ఏళ్ల అపార అనుభవం ఉందన్నారు. తనకు బెన్నెట్ వర్సిటీ ప్రదానం చేసిన డిగ్రీని తల్లిదండ్రులు, భార్య, కుమార్తెకు అకింతం చేస్తున్నట్టు సురేశ్ నారాయణన్ చెప్పారు. ‘నాకు ఎంఫిల్ డిగ్రీ ఇస్తున్నట్టు ఫోన్ చేశారు.. అప్పుడు నేను చెన్నైలో నా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను.. ఈ గౌరవం పొందడానికి వారిద్దరూ ఇక్కడ లేదు.. వారికి చదువు విలువ ఎక్కువగా తెలుసు.. మధ్యతరగతికి చెందిన నా తండ్రి అరకొర ఆదాయంతోనే నన్ను మంచి పౌరుడిగా ఎదిగేందుకు ఉత్తమ విద్యను అందించారు’ అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన నాస్కామ్ అధ్యక్షుడు దేబ్జానీ ఘోష్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు అసౌకర్యంలో సౌకర్యాన్ని వెతుక్కోవాలని అన్నారు. ‘అనిశ్చితి, అస్థిరత, అస్పష్టత- ఇది మాత్రమే మీకు ఉండే ఖచ్చితత్వం.. అవసరమైన నైపుణ్యాలు నిరంతరం మారుతూ ఉంటాయి.. అస్పష్టత, అనిశ్చితితో వ్యవహరించే మీ సామర్ధ్యం అతిపెద్ద పోటీ ప్రపంచంలో ప్రయోజనంగా ఉంటుంది’ అన్నారు.


By August 09, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/biocon-md-kiran-mazumdar-shaw-interesting-comments-on-research-in-bennett-university-convocation/articleshow/85169128.cms

No comments