Anupam Shyam: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ నుంచి వరుస విషాద వార్తలు వింటున్నాం. రీసెంట్‌గా చోటుచేసుకున్న తారల మరణాలు మరవకముందే తాజాగా సీనియర్ నటుడు మరణ వార్త వినాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనుపమ్ శ్యామ్ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అవయవాల వైఫల్యంతో కన్నుమూశారని శ్యామ్ స్నేహితుడు యశ్‌పాల్ శర్మ తెలిపారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన అనుపమ్ శ్యామ్‌ని సబర్బన్ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్ ఆసుప్రతిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. అనుపమ్ తుది శ్వాస విడిచిన సమయంలో ఆయన వద్దే తన సోదరులు అనురాగ్, కంచన్ ఉన్నారని, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్ శర్మ తెలిపారు. హిందీలో ప్రసారమయ్యే ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’తో బాగా ఫేమస్ అయిన అనుపమ్ శ్యామ్ పలు టీవీ సీరియల్స్‌తో ఎన్నో సినిమాల్లో నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, బండిట్ క్వీన్ చిత్రాల్లో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్‌లో ''సత్య, దిల్ సే, లగాన్, హాజరోంకి క్వాయిషీన్ ఐసీ'' లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అనుపమ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
By August 09, 2021 at 09:02AM
No comments