Breaking News

‘నారప్ప’ సీన్ రిపీట్.. దళిత ఉద్యోగితో కాళ్లు పట్టించుకున్న వ్యక్తి, కలెక్టర్ సీరియస్


ఇటీవల విడుదలైన ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్ ఇతర కులాల వారిపై కాళ్లపై పడే సీన్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ అప్పుడప్పుడు చోటుచేసుకుంటూ దేశంలో కుల వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో కులం పేరుతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేగుతోంది. కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ పంచాయితీలో ముత్తుస్వామి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి ఇటీవల భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు అక్కడున్న మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో ముత్తుస్వామి, గోపాలస్వామి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన గోపాలస్వామి దళితుడైన ముత్తుస్వామిని కులం పేరుతో దుర్బాషలాడాడు. తన కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలని, లేకపోతే తన పలుకుబడితో ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన ముత్తుస్వామి ఆవేదనతో గోపాలస్వామి కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.


By August 09, 2021 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dalit-employee-at-tamil-nadu-govt-office-forced-to-fall-at-feet-of-caste-hindu-man-video-goes-viral/articleshow/85169460.cms

No comments