విడిపోతే అలాంటి ఫీలింగ్.. కొందరు మాత్రం అలా.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్
రేణూ దేశాయ్‌కు ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. చాలా మందికి హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆమె రచయిత్రి. కథలు, కవిత్వాలు రాస్తుంటారు. దర్శకత్వం మీద కూడా పట్టుంది. డిజైనింగ్ డిపార్ట్మెంట్‌లోనూ పని చేశారు. ఇలా సినిమాలోని దాదాపు ప్రతీ క్రాఫ్ట్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ప్రతిభనుప్రదర్శిస్తుంటారు. తన కవిత్వాలతో ఎంతో మంది హృదయాలను తడుముతూ ఉంటారు. వాటిలో ఎంతో నిగూఢమైన అర్థం, జీవిత సారం ఉంటుంది. తాజాగా ఆమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్‌లకు సైతం దూరంగానే ఉంటున్నారు. అందుకే డ్రామా జూనియర్స్ షోలోనూ రేణూ దేశాయ్ కనిపించడం లేదు. ఆ మధ్య సునీత, రేణూ దేశాయ్, కృష్ణారెడ్డి వంటివారు న్యాయ నిర్ణేతలుగా ఆ షోలో సందడి చేసేవారు. కానీ ఇప్పుడు రేణూ దేశాయ్ ఆ షోలో కనిపించడం లేదు. అయితే ఈ మధ్యే అకీరా కర్రసాము వీడియోను వదిలి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు రేణూ దేశాయ్. ఇప్పుడు తాజాగా ఓ కవిత్వాన్ని రాసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ కవిత్వం చదువుతూ ఉంటే.. ఆమె జీవితాన్ని చూసినట్టు అనిపిస్తోంది. ‘కొందరు వ్యక్తులు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. ఎలా అంటే వెచ్చిన వేసవిలో చల్ల గాలి వానలా.. వారి కంటి చూపులే మన హృదయానికి నేరుగా హత్తుకుంటాయి.. వాటితో అవి మాట్లాడేసుకుంటాయి. అదో మూగ భాషలా అనిపిస్తుంది. కొన్ని గంటలే వారితో గడిపినా చాలు ఎంతో తృప్తిగా ఉంటుంది. మన ఆత్మకు ఎక్కడా లేని శాంతిని ఇస్తారు. అయితే కొంత మంది మనల్ని వదిలి వీడిపోతుంటే.. బాధ కలుగుతుంది.. కానీ కొంత మంది మాత్రం మన గాయాల్ని, బాధల్ని పూర్తిగా తొలగించి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు.
By August 08, 2021 at 12:59PM
No comments