Breaking News

రజనీ ‘అన్నాత్తే’పై మరో ఆసక్తికర అప్‌డేట్.. ఆ హీరోయిన్ కూడా ముగించేశారట


సూపర్‌స్టార్ రజనీకాంత్. స్టైల్‌కి, హీరోయిజంకి కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది అనే ఆయన అభిమానులు చెబుతారు. అయితే రజనీ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆయన్ని మళ్లీ స్క్రీన్‌పై కనిపించాలని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తలైవా ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ గ్రామ పెద్ద పాత్ర పోషిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార, కీర్తి సురేష్ నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్లు మీనా, కుష్భూలు కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే మీనా ఈ సినిమాకు సంబంధించి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. తాజాగా కూడా తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు. దీంతో సినిమా విడుదల విషయంలో చిత్ర యూనిట్ ఇంకా వేగం పెంచింది అనే చెప్పుకోవాలి. మిగితా పనులు అన్ని పూర్తి అయితే ఈ సినిమాను ఈ దీపావళి కానుకగా అంటే.. నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తలైవా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ అభిమాన నటుడిని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని వాళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. డి.ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


By August 16, 2021 at 12:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-kushboo-finishes-her-dubbing-for-movie-annaatthe/articleshow/85362794.cms

No comments