Breaking News

పుష్ప లీక్స్‌తో గందరగోళం.. సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన ప్రొడ్యూసర్స్! ఇంతలోనే మరో షాక్


ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సినీ ఇండస్ట్రీని లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విడుదలకు ముందే చిత్రానికి సంబంధించిన సీన్స్ బయటకొస్తుండటం చిత్ర వర్గాలను నిరాశ పరుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన కీలక విషయాలు, వీడియోలు, పాటలు ఇలా ఎన్నోరకాల లీక్స్ చిత్ర వర్గాల్లో గందరగోళం నింపుతున్నాయి. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారువారి పాట’ ప్రచార చిత్రంతో పాటు ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్‌ మీడియాలో ముందే లీక్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చిత్రయూనిట్ చాలా కంగారు పడ్డారు. ఇలాంటి లీక్స్ చేసే వారిపై చర్య తీసుకోవాలంటూ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్స్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే అస్సలు ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే అది జరిగిన కొద్దిసేపటికే 'పుష్ప' నుంచి మరో లీక్ బయటకు రావడం షాకిచ్చింది. సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో స్టైలిష్ యాక్షన్‌‌తో ఫైట్ చేస్తూ కనిపించారు. భుజంపై కుర్చీని పట్టుకుని లుంగీ కట్టి మాస్ లుక్‌లో కనిపించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో సుకుమార్ రూపొందిస్తున్న ఈ ‘పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.


By August 16, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mythri-movie-makers-producers-police-complaint-on-leaks-issue/articleshow/85362125.cms

No comments