Breaking News

అండమాన్‌ దీవుల్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు.. రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రత


అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మంగళవారం ఉదయం రెండు భూకంపాలు సంభవించాయి. తొలుత ఉదయం 6.27 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రత సంభవించగా.. 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. తొలుత ఉదయం 6.27 గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.27 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ తెలిపింది. క్యాంప్‌బెల్‌ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. సోమవారం మణిపూర్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. మొయిరాంగ్‌కు 49 కిలోమీటర్ల దూరంలో.. భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, వాటికి భయపడాల్సిన అవసరం లేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఇవి వాతావరణ మార్పుల వల్లే సంభవించనవని పేర్కొన్నారు. అయితే, యూరోపియన్-మెడిటేరియన్ సిస్మాలాజికల్ సెంటర్ మాత్రం అండమాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతో భారీ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. పోర్ట్‌బ్లెయిర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో భూమికి 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ఈ భూకంప ప్రభావం భారత్, మాయన్మార్, థాయ్‌లాండ్‌పై ఉంటుందని వెల్లడించింది.


By August 03, 2021 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-earthquakes-strikes-more-than-6-1-magnitude-near-andaman-and-nicobar-island/articleshow/84997935.cms

No comments