Breaking News

అగ్నికీలల్లో గ్రీస్.. మంటలు ఆర్పుతూ కుప్పకూలిన విమానం


గ్రీస్‌ దేశంలో అగ్నిమాపక విభాగానికి చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం తెలిపింది. గ్రీస్‌, రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్నాయి. గ్రీకు ద్వీపమైన ఎవియాలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్‌లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని పౌర రక్షణ ఉప మంత్రి నికోస్ హర్దాలియాస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఓ విమానం అదుపుతప్పి కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పైలట్ పారాచూట్ సాయంతో దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు.. టర్కీలో ఎనిమిది మంది మరణించారు. వీకెండ్‌లో భారీవర్షం కురవడంతో టర్కీలో వేడిగాలుల నుంచి కొంత ఉపశమనం లభించినా.. గ్రీస్‌లో మాత్రం భారీ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.


By August 09, 2021 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fire-fighting-aircraft-crashed-in-greece-pilot-found-safe/articleshow/85171168.cms

No comments