భార్యకు 50 మంది బాయ్‌ఫ్రెండ్స్... ఫోన్లో ఛాటింగ్ చూసి షాకైన భర్త, అర్ధరాత్రి ప్రియుడితో కలిసి
తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తనే కడతేర్చిందో కసాయి ఇల్లాలు. తమిళనాడులోని అమ్మాపేట మార్కెట్ వీధికి చెందిన ప్రభుదేవా(39)కు కొన్నాళ్ల క్రితం షాలిని(22) అనే యువతితో వివాహం జరిగింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అయితే పెద్దలు బలవంతం పెట్టడంతో అయిష్టంగా అతడిని పెళ్లాడింది. వీరికి ఒకటిన్నర వయసున్న పాప ఉంది. Also Read: ప్రభు సేలంలోని మార్కెట్ వీధిలో అరటి పండ్లు హోల్‌సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల భార్యకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆమె తీరుతో మార్పు వచ్చింది. భర్త, బిడ్డను పట్టింకోకుండా షాలిని నిత్యం ఫోన్ ధ్యాసలోనే ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు సెల్వరాజ్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. మొదట ఛాటింగ్‌తో మొదలైన వీరి వ్యవహారం వీడియో కాల్స్ చేసుకునే వరకు వెళ్లింది. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరు శారీరకంగా కలిసేవారు. భర్త వ్యాపారం కోసం బయటికి వెళ్లగానే షాలికి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకునేది. Also Read: మొదట్లో ప్రభుదేవాకు భార్యకు అంతగా అనుమానం రాలేదు. అయితే రాత్రి సమయంలో పడుకున్నప్పుడు కూడా భార్య తనను పట్టించుకోకుండా వేరొకరితో ఛాటింగ్ చేయడంతో అతడికి అనుమానం మొదలైంది. దీంతో లోతుగా ఆరా తీయగా ఆమె అక్రమ బాగోతం బయటపడింది. ఈ విషయంపై డైరెక్ట్‌గా నిలదీయకుండాన గొడవ పెట్టుకుని ఆమె ఫోన్ లాగేసుకున్నాడు. అయినప్పటికీ షాలిని సీక్రెట్‌గా మరో ఫోన్ వాడుతూ ప్రియుడితో మాట్లాడేది. ఈ విషయం కూడా ప్రభుకు తెలియడంతో భార్యకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు పట్టించుకోకపోవంతో ఓ రోజు షాలిని ఇంట్లోనే ప్రియుడితో రాసలీలల్లో మునిగి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మందలించాడు. Also Read: దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న షాలిని అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతున్న సమయంలో షాలిని ప్రియుడిని రప్పించుకుంది. ఇద్దరూ కలిసి అతడిన కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దూరి భర్తను చంపేశారని చెప్పింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుదేవాను భార్య షాలినియే చంపేసిందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా భర్తను తానే చంపానని అంగీకరించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాలిని పెళ్లికాక ముందు నుంచి సోషల్‌మీడియా అతిగా వాడేదని, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన 50 మందితో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలుసుకుని షాకయ్యారు. ఈ కేసులో పోలీసులు షాలినితో పాటు సెల్వరాజ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె 50 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
By August 09, 2021 at 11:56AM
No comments