మంచు లక్ష్మి ఇల్లు చూస్తే కళ్ళు జిగేల్.. అంతా షో చేసిన సెలబ్రిటీ కిడ్!!
నేటి జనరేషన్ అంతా సోషల్ మీడియా పైనే నడుస్తోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి అరచేతిలో అందుబాటులో ఉండటంతో సామాన్యులు, సెలబ్రిటీల మధ్య దూరం చాలా వరకు తగ్గింది. మరోవైపు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లపై స్పందించే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు డాటర్, నటి అభిమానుల కోరిక తీర్చుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో కనిపించని ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ వేదికగా పంచుకుంటానని ప్రామిస్ చేసింది. అలాగే మీరు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో అడగండి అని చెబుతూ ఇంట్రో వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో ఈ మంచు వారమ్మాయిని హోమ్ టూర్ (మీ ఇల్లు చూపించండి) అని చాలామంది అడిగారట. ఈ విషయాన్ని చెబుతూ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో ఉన్న తన ఇంటిని మొత్తం చూపిస్తూ హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది మంచు లక్ష్మి. వంట గది, హోమ్ ఆఫీస్, తను సినిమాలు చూసే హాల్‌తో పాటు లివింగ్ రూమ్, బెడ్ రూమ్ ఇలా ఇంట్లో ఉన్న ప్రత్యేక గదులన్నింటిని ఈ వీడియోలో చూపించింది. డుప్లెక్స్ హౌస్‌తో పాటు ఇంటి ప్రాంగణం మొత్తాన్ని షూట్ చేసి అందరి ముందు పెట్టింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. మంచు వారి ఇల్లు చూసి ఇంద్ర భవనంలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మోహన్ బాబు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. అమెరికాలో విద్యనభ్యసించి ఇండియా వచ్చిన ఆమె.. తెలుగులో ‘అనగనగ ఓ ధీరుడు’సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత సెలక్టెడ్ సినిమాలు చేస్తూనే బుల్లితెర, ఆన్ లైన్ వేదికలపై తన టాలెంట్‌తో అట్రాక్ట్ చేస్తోంది.
By August 12, 2021 at 10:09AM
No comments