మద్యం మత్తులో డ్రైవర్.. గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ, 8మంది దుర్మరణం
గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జిల్లా సావర్‌కుండ్ల వద్ద రోడ్డు పక్కనున్న గుడిసెలోకి ఓ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్ రాయ్ తెలిపారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
By August 09, 2021 at 10:20AM
No comments