పచ్చిబూతులతో అత్యాచార బెదిరింపులు.. తెలుగు రాకపోతే మంచిదంటూ చిన్మయి కౌంటర్
సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. గత మూడు నాలుగు రోజులుగా దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. నెటిజన్లలో కొందరు ఆమెను ఇష్టమొచ్చినట్టుగా దూషిస్తున్నారు. పచ్చి బూతులతో రెచ్చిపోతోన్నారు. అందులో ఎక్కువగా తెలుగు నెటిజన్లే ఉన్నట్టు కనిపిస్తోంది.ఆ దారుణమైన అసభ్యకరమైన సందేశాలను చిన్మయి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. తాజాగా అలా తనకు వచ్చిన అసభ్య సందేశాలపై చిన్మయి మాట్లాడారు. అసలు ఇంతకీ చిన్మయి మీద ఇప్పుడు ఎందుకు అంత ట్రోలింగ్ జరుగుతుందో ముందు తెలియాలి. లక్నో గర్ల్ ఘటన మీద చిన్మయి స్పందించారు. ఆ అమ్మాయి చేసింది తప్పు.. ఆమె అలా నడిరోడ్డు మీద అంతలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అని క్యాబ్ డ్రైవర్‌కు మద్దతుగానే స్పందించారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఆమె ఆంగ్లంలోనే రాసుకొచ్చారు. ఆ విషయంలోని మ్యాటర్ అర్థం కాని కొందరు మీమర్స్ మాత్రం చిన్మయిపై నెగిటివ్‌గా రాసుకొచ్చారు. ఎలాగూ ఆమె ఫెమినిస్ట్ కదా? లక్నో గర్ల్‌కు మద్దతుగా రాసి ఉంటుందని బావించారేమో. చిన్మయిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని చిన్మయి సదరు మీమర్స్‌ను అడిగితే.. మీ పోస్ట్ చదవలేదు.. నాకు ఇంగ్లీష్ రాదు అని సమాధానం ఇచ్చాడట. అలా తన పోస్ట్‌లు చదవకపోయినా ఇలా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారంటూ మీమర్స్‌ను చిన్మయి టార్గెట్ చేశారు. కొన్ని మీమ్స్ పేజీలు, మీమర్స్ మీద చిన్మయి సెటైర్లు వేశారు. అయితే ఇలా తమ మీమర్స్ మీద కౌంటర్లు వేయడం, కామెంట్ చేయడంపై ఓ వ్యక్తి చిందులు తొక్కాడు. ఆవేశాన్ని ఆపుకోలేక చిన్మయిని దారుణంగా తిట్టేశాడు. అందులోనూ తెలుగులో పచ్చి బూతులతో రెచ్చిపోతూ రేప్ చేస్తానని బెదిరించాడు. అలా తెలుగులో పచ్చి బూతులు రాయడంతో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. కొంత మంది మగాళ్లు నాకు ఎలా డైరెక్ట్ మెసెజ్‌లు చేస్తారో మీరంతా చూడాలి. మీకు తెలుగు భాష రాకపోతే ఇంకా మంచిది.. ఈ చెత్త పదాలు తెలియకుండా ఉంటాయి అని సెటైర్ వేశారు. ఇక ఆ స్క్రీన్ షాట్లో చిన్మయిని దారుణంగా అవమానించాడు. పచ్చి బూతులతో రెచ్చిపోయాడు.
By August 07, 2021 at 07:46AM
No comments