విమానంలో క్యాబిన్ క్రూ వక్షోజాలను తాకుతూ అసభ్య ప్రవర్తన.. యువకుడికి తగిన శాస్తిచేసిన సిబ్బంది!
విమానంలో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి విమాన సిబ్బంది తగిన శాస్తి చేశారు. అతడి దురుసు ప్రవర్తనను భరించలేని సిబ్బంది యువకుడ్ని సీటుకు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. విమానం ఎయిర్‌పోర్ట్‌కు చేరిన తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఫిలడెల్పియా నుంచి మియామీకి వెళుతున్న విమానంలో ఆదివారం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా-మియామీ విమానంలో మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే అమెరికా యువకుడు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరు మహిళ క్రూ సిబ్బంది ప్రయివేట్ భాగాలను తాకి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులతో మాటల యుద్ధానికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై దాడికి దిగాడు. దీంతో విసుగు చెందిన విమాన సిబ్బంది అతడిని పట్టుకుని కూర్చున్న సీట్లోనే టేప్ సాయంతో కట్టేశారు. మాట్లాడకుండా నోటికి కూడా ప్లాస్టర్ చుట్టారు. ఆ యువకుడిని అలా కట్టేస్తుంటే తోటి ప్రయాణికులంతా ఆనందం వ్యక్తం చేశారంటే మహానుభావుడు ఎంతటి రభస చేశాడో ఇట్టే అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు కొందరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటి ప్రయాణికులపై యువకుడు అరవడం, సిబ్బందిపై దాడికి సంబంధించిన ట్విటర్ వీడియోను ఇప్పటి వరకు 12.8 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. విమానం ల్యాండ్ అవుతుండగా సీట్లో కట్టేసి ఉన్న అతడు ‘నన్ను కాపాడండి’ అంటూ అరుస్తున్న మరో వీడియోకు 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలను వీక్షించిన నెటిజన్లు నిందితుడికి తగిన గుణపాఠం చెప్పారని కామెంట్లు పెడుతున్నారు. ఏబీసీ జర్నలిస్ట్ శామ్ స్వీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ‘నా తల్లిదండ్రులు మిలీనియర్లు.. మాకు 2 మిలియన్లకుపైగా ఆస్తి ఉంది..’ అంటూ అతడు అరుస్తున్నాడు. ఈ ఘటనపై ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విచారణకు ఆదేశించింది. ప్రయాణికుడిని అదుపుచేయడంలో తగిన విధానాలను అనుసరించలేదని పేర్కొంటూ క్యాబిన్ క్రూను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. అయితే, దీనిపై దుమారం రేగడంతో వేతనంతో కూడిన సెలవుపై పంపినట్టు తెలిపింది. విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ‘ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ మా సిబ్బంది ఈ విమానంలో దాడికి పాల్పడిన వారి సహా అందరికి అత్యంత విలువ, గౌరవాన్ని ఇవ్వడంలో ముందుంటారు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
By August 07, 2021 at 07:23AM
No comments