Breaking News

Tuck Jagadish On OTT : నాలుగు కోట్ల కోసమే అలా.. నానిపై సంచలన ఆరోపణలు


ప్రస్తుతం థియేటర్ల వ్యవస్థ ఎలాంటి స్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న థియేటర్ల వ్యవస్థను కాపాడేందుకు పెద్ద హీరోలెవ్వరూ ముందుకు రావడం లేదు. చిన్న సినిమాలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వంటి హీరో సైతం థియేటర్ల గురించి ఎంతో గొప్పలు మాట్లాడి చివరకు ఓటీటీకే తమ సినిమాను అమ్ముకున్నారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు.. అమ్ముకుంటున్నారని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సర్దుకుపోయారు. కానీ విడుదల తేదీ విషయంలో వారు భగ్గుమంటున్నారు. సునీల్ నారంగ్ తన సినిమాను వినాయక చవితి సందర్భంగా లవ్ స్టోరీ సినిమాను వచ్చె నెల సెప్టెంబర్ 10న థియేటర్లోకి రాబోతోన్నట్టు ప్రకటించారు. ఇదే తేదీకి ఓటీటీలో టక్ జగదీష్‌ను రిలీజ్ చేయాలని అమెజాన్‌తో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసిందట. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ నిన్న మీడియాతో సమావేశం అయ్యారు. అందులో నాని మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. తిమ్మరుసు ఈవెంట్‌లో నాని ప్రగల్భాలు పలికారు. థియేటర్లోనే సినిమాలు చూడాలి.. అవి మన కల్చర్.. అదే మన సంస్కృతి అంటూ చెప్పుకొచ్చారు. అయితే దాని వెనుక, అలా మాట్లాడటానికి పెద్ద కారణమే ఉందట. ఆయన అలా మాట్లాడిన రోజే.. అమెజాన్‌తో డీల్ జరిగిందట. కానీ ఓ నాలుగు కోట్లు తేడాగా వారు కోట్ చేశారట. అయితే నాని స్టేజ్ మీదకు వచ్చి అలా మాట్లాడి, థియేటర్లను అడ్డం పెట్టుకున్నాడని అన్నారు. నాని అలా స్టేజ్ మీద మాట్లాడటంతో అమెజాన్ దిగి వచ్చి ఆ నాలుగు కోట్లు కూడా ఇచ్చిందట. మొత్తానికి నాని వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నాని గనుక టక్ జగదీష్ విడుదల విషయంలో వెనకడుగు వేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలే ఎదుర్కొనేలా కనిపిస్తోంది.


By August 21, 2021 at 07:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-may-play-tricks-for-tuck-jagadish-deals-on-4-crores/articleshow/85505579.cms

No comments