Breaking News

మహేష్ బాబు బర్త్ డే స్పెషల్: సర్కారు వారి పాట సూపర్ కిక్ రెడీ.. ఈ సారి మోతకి బొమ్మ దద్దరిల్లిపోద్ది!!


వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం '' మూవీ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా అప్‌డేట్స్ మహేష్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. తాజాగా మరో స్పెషల్ అప్‌డేట్ అంటూ మహేష్ ఫ్యాన్స్‌ని హూషారెత్తించారు మేకర్స్. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ ప్లాన్ చేశారు. 'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ తర్వాత ఈ మరో భారీ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ''ఈ సారి మోతకి బొమ్మ దద్దరిల్లిపోద్ది'' అని తెలుపుతూ మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. మహేష్ అభిమానులకు సూపర్ స్పెషల్ డే కాబోతున్న ఆ రోజున టీజర్ విడుదల చేయనున్నారా? లేక ఇంకేదైనా ప్రత్యేకమైన అప్‌డేట్ ఇస్తారా అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు మహేష్ బాబు పుట్టిన రోజుపై పడింది. మరోవైపు 'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ ట్విట్టర్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి దూసుకుపోతోంది ఈ పోస్టర్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న రీ ట్వీట్స్, లైకులతో సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే పోస్టర్ దర్శనమిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతూ జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.


By August 03, 2021 at 10:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sarkaru-vaari-paata-special-surprise-on-mahesh-babu-birth-day/articleshow/84996768.cms

No comments