Breaking News

Rakshasudu2: భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌ సినిమా.. స్టార్ హీరోతో పక్కా ప్లాన్.. అధికారిక ప్రకటన


2019 సంవత్సరంలో వచ్చిన 'రాక్షసుడు' సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ . సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం సంగతి అటుంచితే.. కథ, కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వల్ రూపొందించి మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయాలని భావించిన మేకర్స్, ఈ సారి గట్టిగానే స్కెచ్చేశారు. సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా తగ్గకూడదని డిసైడ్ అయ్యారు. 'రాక్షసుడు' సినిమాకు సీక్వల్‌గా 'రాక్షసుడు- 2' రూపొందించనున్నట్లు ఇటీవలే అఫీషియల్ ప్రకటన చేసిన రమేష్ వర్మ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటితో (ఆగస్టు 2) ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా '' కు సంబంధించిన మరో పోస్టర్‌ వదిలారు. అంతేకాదు 'రాక్షసుడు 2' చిత్రాన్ని భారీ రేంజ్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు డైరెక్టర్ రమేష్ వర్మ. ఓ టాప్ స్టార్‌తో ఈ మూవీ ఉంటుందని ఆయన చెప్పారు. 'రాక్షసుడు- 2' కోసం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథను సిద్ధం చేసిన రమేష్ వర్మ.. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట. ఈ మేరకు సినిమా కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. హాలీవుడ్‌ స్థాయిలో సీక్వెల్‌ కథ సిద్ధమైందని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండనుందని నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ లండన్‌లో ప్రారంభిస్తామని అన్నారు. దీంతో ఈ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరనేదానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.


By August 03, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-ramesh-varma-syas-rakshasudu2-with-top-star/articleshow/84995470.cms

No comments