Breaking News

అమ్మను కాపాడేందుకు ప్రయత్నిద్దాం.. భరోసా ఇచ్చిన బండ్లన్న!


టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, నటుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.సెలెబ్రిటీల బర్త్ డేలు ట్వీట్ చేయడమే కాదు.. సాధారణ ప్రజల కష్టసుఖాలకు కూడా రియాక్ట్ అవుతుంటారు. అలా బండ్ల గణేష్ పేదల కష్టాలను తీర్చే ఆపద్భాందవుడు అవుతున్నాడు. అందరికీ సాయం చేస్తూ అందరివాడు అనిపించుకుంటున్నారు. తాజాగా బండ్ల గణేష్ ఓ నెటిజన్ చేసిన అభ్యర్థనకు స్పందించి.. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గత లాక్డౌన్ నుంచి బండ్ల గణేష్ చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. అడిగిన వారికి డబ్బులు ఇవ్వడం, పుస్తకాలు కొనివ్వడం, ఉద్యోగాలు ఇప్పించడం ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ వేసిన పోస్ట్‌, ఆయన సమస్యకు బండ్లన్న వెంటనే స్పందించారు. దీంతో అందరూ బండ్లన్న మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కొంతమంది సేవాగుణం వాళ్లంతా కలిసి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా గ్రూఫ్ ఫండింగ్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలా ఓ నెటిజన్ తన అమ్మకు బ్రెస్ట్ కాన్సర్ అని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు. దీని కోసం అందరి సాయాన్ని అర్థించాడు. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా విరాళం అందింది. మెడికోవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యం అందిస్తున్నామని, వీలైన సాయం చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తే.. బండ్లన్న స్పందించారు. మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి..మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామని తెలిపారు. దీంతో బండ్లన్న చేస్తున్న సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


By August 02, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bandla-ganesh-help-to-netizen-mother/articleshow/84962797.cms

No comments