Breaking News

Bengaluru కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ఆడి కారు.. ముగ్గురు అమ్మాయిలు సహా ఏడుగురు మృతి


కర్ణాటకలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం సంభవించింది. బెంగళూరు నగరంలోని కోరమంగళలో ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు యువతులు ఉన్నారు. మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఆరుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. మృతులంతా 20 నుంచి 25 ఏళ్లలోపువారేని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయినవారిలో ఓ యువకుడ్ని హోసూర్‌కు చెందిన రాజకీయ నేత వై ప్రకాశ్ కుమారుడు కరుణ సాగర్‌గా గుర్తించారు. మిగతావారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం జరిగిందనేది దర్యాప్తులో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.


By August 31, 2021 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-killed-in-car-rammed-electric-pole-in-koramangala-of-bengaluru/articleshow/85787391.cms

No comments