Breaking News

third wave రాబోయే 125 రోజులు అత్యంత కీలకం.. లేకపోతే..: నీతి-ఆయోగ్


ప్రస్తుతం ప్రపంచం ప్రారంభ దశలో ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే 100- 125 రోజులు అత్యంత కీలకమని సభ్యుడు హెచ్చరించారు. యావత్‌ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండగా భారతీయుల బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వీకే పాల్ సూచించారు. ‘ప్రపంచ దేశాలు థర్డ్‌వేవ్‌ దిశగా వెళుతున్నాయి.. ఉత్తర, దక్షిణ అమెరికాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి.. అందుచేత దీన్ని హెచ్చరిక (రెడ్‌ ఫ్లాగ్‌)గా భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా సూచించారు.. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ను ఆపాలనే లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు.. ఇది వాస్తవంగా సాధ్యమైనదే’ అని పాల్‌ పేర్కొన్నారు. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వారపు కేసుల్లో 64 శాతం, నెదర్లాండ్‌లో 300శాతం పెరిగాయి. థాయిలాండ్‌లో చాలా రోజులుగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ తాజాగా అక్కడ మరోసారి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ఆఫ్రికాలోనూ పాజిటివ్‌ కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మయన్మార్‌, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో ఊహించని విధంగా వైరస్‌ తీవ్రత పెరుగుతోందని వీకే పాల్‌ గుర్తుచేశారు. ‘దేశంలో చాలా మందికి వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదు.. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కూడా మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ పొందలేదు.. వ్యాక్సినేషన్‌ ద్వారానే దీన్ని పొందాల్సి ఉంది.. కనీసం 50 శాతం మందికి టీకాలు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యం కావచ్చు.. అయినప్పటికీ ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇదే పరిస్థితిని మున్ముందు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే 100-125 రోజులు అత్యంత కీలకం’ అని వీకే పాల్‌ స్పష్టం చేశారు. ‘‘జులైకి ముందు 50 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ అందజేయాలని నిర్దేశించిన లక్ష్యం వైపు కొనసాగుతున్నాం.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఉన్నాం.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ 66 కోట్ల డోస్‌లను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.. అదనంగా మరో 22 కోట్ల డోస్‌లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లనున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ‘రెండు డోస్‌ల తీసుకున్న పోలీస్ సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించే ముప్పు తప్పింది.. ఫ్రంట్‌లైన్ వర్కర్లలైన పోలీసులపై తమిళనాడులో ఈ అధ్యయనం జరిగింది’ అని పాల్ తెలిపారు. ‘రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియంట్‌‌పై 95 శాతం మరణాలను నివారించడంలో పోలీసు సిబ్బందికి రెండు డోస్‌లు కోవిడ్-19 వ్యాక్సిన్ విజయవంతమైంది’ అని అధ్యయనం తెలిపింది. ‘1,000 కోవిడ్-19 మరణాల్లో టీకా తీసుకోనివారు 1.17 శాతం, పాక్షికంగా వ్యాక్సిన్ వేసివారిలో 0.21, పూర్తిగా టీకాలు వేసిన వారిలో 0.06 మంది ఉన్నారు’అని అధ్యయనం పేర్కొంది. అయితే, థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందా లేదా అనేది ముఖ్యం కాదని.. వైరస్‌ను ఏమేరకు ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని.. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో వాటిని నియంత్రించడం కూడా సవాలుగా మారొచ్చని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది.


By July 17, 2021 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/warning-signal-next-100-125-days-critical-says-niti-aayog-member-vk-paul/articleshow/84491345.cms

No comments