Sekhar Kammula : ధనుష్‌ను కలిసిన నిర్మాత, దర్శకులు.. శేఖర్ కమ్ముల పక్కన అలా!
కోలీవుడ్ స్టార్ హీరో పాపులారిటీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే ధనుష్ దుమ్ములేపనున్నారు. కథ, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్‌లను కొట్టేస్తున్నారు. అలా ధనుష్ ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇంత వరకు డబ్బింగ్ సినిమాలతోనే ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. కానీ ఇక నేరుగా టాలీవుడ్‌లోకి ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గత నెలలోనే జరిగిన సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తన సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ధనుష్‌ను ఈ సినిమా నిర్మాతలు, దర్శకుడు శేఖర్ కమ్ముల శుక్రవారం కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకులు, నిర్మాతల పక్కన ఎంతో వినయంగా నిల్చోవడం, చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు. పక్కన ధనుష్ ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ ‘అత్రాంగి రే’, హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’తో బిజీగా ఉన్నారు.
By July 03, 2021 at 08:10AM
No comments