ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళ ఎక్కడ దాచిందంటే
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాబుల్ నుండి వచ్చిన ప్రయాణికురాలి వ్యవహారశైలిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ లేడీ కిలాడీని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో లేడీ కిలాడీ ఆట కట్టించడంతో అక్రమ బంగారం రవాణా గురించి గుట్టు రట్టు అయ్యింది. ఈ లేడీ కిలాడీ ఎంతో తెలివిగా కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని కరిగించి వేస్ట్ గా మార్చింది. లోదుస్తుల్లో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసింది. ఈ లేడీ కిలాడీ అఫ్ఘాన్ దేశస్థురాలిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద ఉన్న 800 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 37 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారం రవాణా కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
By July 14, 2021 at 10:25AM
No comments