Breaking News

సరిహద్దులో డ్రోన్.. పోలీసుల కాల్పులు


జమ్మూ కశ్మీరులో పోలీసులు కాల్పులకు దిగారు. ఇవాళ ఉదయం ఓ డ్రోన్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. జమ్మూ జిల్లా అఖ్నూరులో అంతర్జాతీయ సరిహద్దు 8 కిలోమీటర్ల లోపల అనుమానాస్పదంగా ఎగురుతున్న డ్రోన్ ఎగురుతుండగా జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్‌పై కాల్పులు జరిపి కూల్చారు. ఈ డ్రోన్ లో 5కిలోల మందుగుండు సామాగ్రితోపాటు పేలుడు పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్ ను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ మిలిటెంట్లు ప్రయోగించారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఉగ్ర దాడికి ఉగ్రవాదులు మోడస్ ఆపరేషన్ నిర్వహించారని జమ్మూ పోలీసులు భావిస్తున్నారు. జమ్మూలోని వైమానిక కేంద్రం వద్ద జూన్ 27వతేదీన డ్రోన్ కనిపించింది. ఆ తర్వాత జమ్మూలోని పలు ప్రాంతాల్లో పలు డ్రోన్లు కనిపించాయి. జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్ కనిపించడం మొదటిసారి. అయితే ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదేశించారు. పోలీసులు భద్రత బలగాలను అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.


By July 23, 2021 at 09:15AM


Read More https://telugu.samayam.com/year-ender/year-ender-2017/latest-news/jammu-and-kashmir-police-shoots-down-drone-recovers-5-kg-ied/articleshow/84666116.cms

No comments