Breaking News

దుబాయ్‌లో కృత్రిమ వర్షం.. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేక


మనదేశంలో ప్రస్తుతం వానాకాలం సీజన్. ఎటు చూసిన వర్షాలే వర్షాలు. అయితే అటు సౌదీ అరేబియాలో మాత్రం ప్రస్తుతం వేసవి కాలం. ఎండలకు జనం అల్లాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో జనం వేడి భరించలేకపోతున్నారు. దుబాయ్‌లో ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో జనం ఉక్కపోతకు, వేడికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ నిపుణులు డ్రోన్ల సాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వర్షాన్ని కురిపించారు. ఏడారి దేశాల్లో వీపరితమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగేలా కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా కొత్త ఆవిష్కరణను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. డ్రోన్లతో మేఘాలను విద్యుత్‌ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది ఈ టెక్నాలజీ సాయంతో మేఘాలను విద్యుదావేశానికి గురిచేస్తారు. దాంతో మేఘాలు కరిగి, అధిక వర్షపాతాన్నిస్తాయి. ఈ డ్రోన్ క్లౌడింగ్ సీడింగ్ ప్రక్రియతో దుబాయ్ నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్ లో పంచుకున్నారు. రికార్డు స్థాయి ఎండలకు గల్ఫ్ దేశాలు పెట్టింది పేరు. దుబాయ్ లో సాలీనా సగటున కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిలో సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిను 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు నమోదుచేస్తున్నాయి.ఈ ప్రక్రియను చేయడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు.


By July 23, 2021 at 09:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/dubai-creates-its-own-rain-to-battle-50c-heat-with-using-zapper-drones/articleshow/84666730.cms

No comments